బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:55 IST)

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దళిత బాలికపై పోలీసు అత్యాచారం.. ఎక్కడ?

victim
సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిపోతున్నారు. ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చిన ఓ దళిత మహిళపై కామంతో కళ్ళుమూసుకునిపోయిన పోలీసు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ దళిత మహిళను కొందరు అకతాయిలు వేధింపులకు గురిచేస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో ఠాణాలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండేకు తన బాధను వివరించింది. ఆ వెంటనే ఆయన నిందితులను అరెస్టు చేసేందుకు వెళదామని చెప్పి, బాధితురాలిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. అధికారి చెప్పిన మాటలు నమ్మిన అతనితోపాటు వెళ్లింది. దారిలో కారు ఆపి మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని ఆమెతో తాగించాడు. 
 
దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ స్పృహలోకి వచ్చిన బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి సదరు పోలీసుపై ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఆ కామాంధ ఎస్‌ఐను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండే కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.