శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (17:19 IST)

దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

victim
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ చర్యను వీడియో తీసి బాధితురాలి భర్తకు కూడా పంపించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఈ దారుణ ఘటన రాయ్‍బరేలి జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన ఓ దళిత యువతి.. తన ముస్లిం స్నేహితురాలి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. దాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో సెప్టెంబరు 2వ తేదీన ఒక కేఫ్‌కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె చెప్పిన కేఫ్ వద్దకు దళిత యువతి వెళ్లింది. అప్పటికే తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఒకరు బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొకరు బార్బర్‌గా పని చేసే నజీమ్. 
 
వీరంతా కలిసి ఆ యువతిని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి, దాన్ని ఆమె భర్తకు పంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. పైగా, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయసాగారు. వారి వేధింపులను భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు.