ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (09:21 IST)

మాదాపూర్‌లో రేవ్ పార్టీ... పోలీసుల అదుపులో సినీ ప్రముఖులు

rave party
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మాదాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ రేవ్ పార్టీని పోలీసులు గుర్తించారు. ఇక్కడ రేప్ పార్టీ జరుగుతుందన్న పక్క సమాచారం మాదాపూర్ నార్కోటిక్స్ విభాగం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఇందులో పలువురు సినీ ప్రముఖులతో పాటు ధనవంతుల పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఓ సినీ నిర్మాతతో పాటు ఇండస్ట్రీకి చెందిన యువతులు ఉన్నట్టు వార్తలు వస్తున్నారు. ఈ రేప్ పార్టీలో పాల్గొన్న వారి వద్ద నార్కోటిక్సి విభాగం పోలీసులు భారీ మొత్తంలో మత్తపదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుల్లో సినీ నిర్మాత ఒకరు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.