లీలా పవిత్ర కడుపులో పదేపదే పొడిచిన దినకర్... విస్తుపోయే నిజాలు
ఇటీవల బెంగుళూరు నగరంలో కాకినాడకు చెందిన లీల పవిత్ర దారుణ హత్యకు గురైంది. ఏపీకే చెందిన ఆమె మాజీ ప్రియుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి 7.30 గంట సమయంలో దినకర్ అతని ప్రియురాలు లీలా పవిత్రా ఉద్యోగం చేస్తున్న మురగేశ్ పాళ్యలోని కంపెనీ వద్దకు తీసుకెళ్లాడు. రాత్రి పని ముగించుకుని లీలా పవిత్ర కంపెనీ నుంచి బయటకు వచ్చింది. అపుడు ఆమె వద్దకు వెళ్లిన దినకర్.. నీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఆమె కొద్దిగా పక్కకు వచ్చింది.
తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడుగుతూనే జైబులో నుంచి కత్తి తీసిన దినకర్.. మొదట కడుపులోనే పదేపదే పొడిచాడు. దీంతో లీలా కేకలు వేయడంతో ఇంకా రగిలిపోయిన దినకర్ ఆమె ఛాతి ముఖం, గొంతు తదితర చోట్ల ఇష్టం వచ్చినట్టుగా 16సార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పవిత్ర... అక్కడే కుప్పకూలిపోయి మృత్యువాతపడింది.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే, బెంగుళూరు పోలీసులు కూడా తగిన రీతిలో స్పందించలేదనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఏపీలో కూడా బాధితురాలు దినకరన్‌పై ఫిర్యాదు చేసినా కూడాతగిన చర్యలు తీసుకోలేదు. మరోవైపు లీలా పవిత్ర అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి.