సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (12:33 IST)

తల్లి కళ్ళెదుటే బాలికపై సామూహిక అత్యాచారం

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నతల్లి కళ్లెదుటే బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా నడిచివెళుతున్న తల్లీ కుమార్తెపై కామాంధులు దాడి చేశారు. తొలుత తల్లిపై దాడి చేసి.. ఆ తర్వాత ఆమె ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లాలోని బాధితురాలు తన తల్లితో కలిసి ఉంటుంది. ఆదివారం రాత్రి ఫంక్షన్ కోసం వారిద్దరూ డియోఘర్‌కు వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా, మధుపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
ఐదుగురు దుండగులు రెండు బైకులపై మీద తల్లీ కుమార్తెను వెంబడించారు. వారితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే బాలికను బలవంతం చేసి పక్కను లాక్కెళ్లారు. అక్కడ ఆమె ప్రతఘటించినప్పటికీ మైనర్‌బై దాడి చేశారు. ఆమెను బలవంతంగా ఐదుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తల్లి కళ్ల ఎదుటే బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఓ నిందితుడుని అరెస్టు చేశారు.