గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (16:23 IST)

తెల్లని మంచు.. ఎలుగుబంటి తల్లీపిల్లల ఆట.. వీడియో వైరల్ (video)

Bear
Bear
తల్లికి పిల్లలకు వున్న అనుబంధం వెలకట్టలేనిది. తెల్లని మంచులో ఓ పెద్ద ఎలుగుబంటి పడుకుని ఉంది. దాని పక్కనే పిల్ల ఎలుగుబంటి ఆడుకుంటోంది. తల్లిపై పడి పొర్లుతూ ముద్దాడుతోంది. అందుకు తగిట్లు తల్లి కూడా పిల్లతో ఆడుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో అన్వేషకులు ఈ వీడియోను చిత్రీకరించారు. చుట్టూ తెల్లని మంచు మధ్య తెల్లని మంచు ఎలుగుబంట్ల ఆట చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ట్విట్టర్‌‌లో పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 22 లక్షల వ్యూస్‌ వచ్చాయి. లక్షా 26 వేలకుపైగా లైకులు, వేల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి.