గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (10:36 IST)

ఏడేళ్ల బాలిక అత్యాచార కేసులో ముద్దాయికి ఉరిశిక్ష : ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

hang
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముద్దయిగా తేలిన వ్యక్తిన ఒంగోలు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్ధయ్య గత 2021 జూలై 8వ తేదీన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కుమార్తె వరుసయ్యే ఏడేళ్ల కుమార్తె చిన్నారిని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి తెగబడ్డాడు. 
 
ఆ బాలిక భయంతో కేకలు వేచయడంతో మంచానికేసి గట్టిగా కొట్టాడు. దీంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. ఆపై ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి చనిపోవడంతో మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి సైకిల్‌పై గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి పడేసి పారిపోయాడు. దీనిపై మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణ ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ నిందితుడు సిద్ధయ్యను ముద్దాయిగా తేల్చుతూ ఆయన చనిపోయేంత వరకు ఉరితీయాలంటూ సంచలన తీర్పునిచ్చారు. అలాగే, బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, ఈ కేసులో నేరం జరిగిన 18 నెలల్లోనే దోషికి మరణశిక్ష పడిందని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు.