గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:19 IST)

నేను అమ్మవారి అంశనంటూ సోదరి తల నరేకిసిన బాలిక, పరుగులు తీసిన స్థానికులు

Kaalika
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తను అమ్మవారి అంశనంటూ దేవత విగ్రహం వద్ద వున్న కత్తిని తీసుకుని ఇంట్లో నిద్రిస్తున్న తన సోదరి తలను నరికేసిన దారుణ ఘటన జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రంలోని డూంగర్‌పూర్ పరిధిలో జింజ్వాఫాలా గ్రామానికి చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. కాసేపటికి శంకర్ పెద్దకుమార్తె వింతగా ప్రవర్తిస్తూ తను అమ్మవారి అంశనంటూ దేవతా విగ్రహం వద్దనున్న కత్తిని తీసుకుంది. ఆ కత్తితో పూజలు చేస్తున్నవారిపైకి వచ్చింది.

 
ఆమెను వారించేందుకు తండ్రి, ఆమె పెదనాన్న ప్రయత్నించగా కత్తితో వారిని తీవ్రంగా గాయపరిచింది. దీనితో భయభ్రాంతులకు గురైన అక్కడివారు బయటకు పరుగులు తీసారు. కత్తి పట్టుకున్న ఆ బాలిక ఇంట్లో బీభత్సం సృష్టించింది. చివరికి గదిలో నిద్రిస్తున్న తన సోదరి తలను కత్తితో నరికేసింది. ఆ ఘటనతో అంతా షాక్ తిన్నారు. విషయాన్ని పోలీసులకు తెలుపడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.