సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:11 IST)

ప్రియుడితో భార్య గర్భవతి అనుకుని భార్యను, ఆమె ప్రియుడిని ఏం చేసాడంటే?

అనుమానం పెనుభూతమైంది. భార్య గర్భవతి అని తెలిసి సంబరపడిపోవాల్సిన అతను అనుమానంతో రగిలిపోయాడు. పక్కింటి కుర్రాడితో తన భార్య గర్భం తెచ్చుకున్నదని అనుమానపడ్డాడు. దీనికితోడు ఆమె పక్కింటి యువకుడితో పొద్దస్తమానం మాట్లాడటం అతడి అనుమానాన్ని మరింత పెంచేసింది.

 
అంతే... రాత్రివేళ కొడవలి తీసుకుని 8 నెలల గర్భవతి అయిన భార్యపై దాడికి దిగాడు. అడ్డువచ్చిన బావమరిదిపైనా విచక్షణారహితంగా దాడి చేసాడు. కొడవలి తీసుకుని తన భార్యతో చనువుగా వుంటున్న యువకుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ యువకుడి తల్లిదండ్రులు కనిపించడంతో వాదనకు దిగాడు.

 
ఆ తర్వాత కోపంతో వారిని కూడా కొడవలితో హతమార్చాడు. ఆ తర్వాత భార్య ప్రియుడి కోసం నడిరోడ్డు మీద కొడవలి తీసుకుని కాపు కాచాడు. అతడి కోసం ద్విచక్రవాహనంపై గాలించాడు. అతడి ఆచూకి లేకపోవడంతో బతికిపోయాడతను. ఈ ఘటన కర్నాటకోని మైసూరు జిల్లా నలవినూరు గ్రామంలో జరిగింది. నిందితుడు ఈరయ్యను పోలీసులు అరెస్టు చేసారు. తీవ్రంగా గాయపడిన అతడి భార్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.