శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

వివాహితతో అక్రమ సంబంధం.. పట్టపగలు యువకుడి దారుణ హత్య.. ఎక్కడ?

vamsi
వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు పట్టపగలు దారుణంగా హత్య చేశారు. ఈ మహిళ, మృృతుడు గతంలో ప్రేమికులు కావడం గమనార్హం. ఆమెకు వివాహమైనప్పటికీ.. ఇంకా ఆమెతో మాట్లాడుతుండటంతో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలో ఆదివారం జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బీర్కూర్‌కు చెందిన జువ్వికింది వంశీ (23) తుంగూరులోని డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, వంశీ గతంలో ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో రెండేళ్ల కిందట ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయినప్పటికీ వంశీ, ఆ యువతి తరచూ ఫోనులో మాట్లాడుకుంటూ, ఏకాంతంగా కలుసుకుంటున్నారని ఆమె కుటుంబసభ్యులు అతడిని పలుమార్లు హెచ్చరించారు. అ
 
యినా అతడిలో మార్పు రాలేదన్న కోపంతో హత్యకు పాల్పడ్డారని సమాచారం. వంశీ ఆదివారం కొల్వాయి నుంచి తుంగూర్కు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించి గొడ్డలి, ఇతర ఆయుధాలతో తలపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది తెలిసి.. వంశీ బంధువులు, గ్రామస్థులు అక్కడికి వచ్చి ఆందోళన చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ ధర్నాకు దిగారు. 
 
మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా మృతుడి తల్లి భాగ్య, బాబాయి అక్కడే ఉన్న లారీ కింద పడుకున్నారు. డీఎస్పీ ప్రకాశ్, సీఐ ఆరీఫ్ అలీ, సారంగాపూర్, రాయికల్ ఎస్ఐలు తిరుపతి, అజయ్‌లు వారితో చర్చించారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశారు. యువతి తండ్రి రమేష్, సోదరుడు విష్ణు కలిసి హత్య చేశారంటూ వంశీ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వంశీ సెల్ఫోన్ కనిపించడంలేదని, హంతకులు తీసుకెళ్లి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. భాగ్య కూలి పనులు చేసుకుంటుండగా తండ్రి శ్రీహరి ఉపాధి నిమిత్తం ముంబైలో ఉన్నారు.