గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (15:16 IST)

సోలార్ ప్యానెల్‌ ఐడియా.. రుణాలు రెడీగా వున్నాయ్!

Solar plant
Solar plant
దేశవ్యాప్తంగా సోలార్ ప్యానెల్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సౌర విద్యుత్తు పథకాన్ని ప్రోత్సహిస్తోంది. అంతే కాదు బ్యాంకులు కూడా సోలార్ ప్యానెళ్లకు సులభ వాయిదాల్లో రుణాలు అందజేస్తున్నాయి. దీనికి సబ్సిడీ కూడా లభిస్తుంది. 
 
ఇంటిలో ఖాళీగా ఉన్న పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సోలార్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. 
 
ఒక అంచనా ప్రకారం మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా 30 వేల రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలంటే.. ఏదేని కంపెనీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. 
 
స్థానిక విద్యుత్ సంస్థల నుండి లైసెన్స్ పొందాలి. విద్యుత్తు సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కిలోవాట్‌కు 60-80 వేల రూపాయల వరకుపెట్టుబడి పెట్టాలి. 
 
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీని ఇస్తుంది. సబ్సిడీ లేకుండా సోలార్ ప్యానెళ్లను అమర్చాలంటే ఒక కిలో వాట్‌కు దాదాపు రూ.లక్ష ఖర్చు అవుతుంది. 
 
సోలార్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత.. దానిని యూనిట్ చొప్పున అమ్ముకోవచ్చు. పవర్ గ్రిడ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే ప్రైవేట్ సంస్థలకు విద్యుత్‌ను విక్రయించవచ్చు. తద్వారా భారీగా ఆదాయం వస్తుంది.
 
సోలార్ ప్యానెళ్లను కొనుగోలు చేయడానికి పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అథారిటీని సంప్రదించవచ్చు. లేదంటే ప్రైవేట్ కంపెనీలు, డీలర్ల వద్ద కూడా సౌర పలకను కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పుపై 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను అమర్చినట్లయితే, రోజుకు దాదాపు 10 యూనిట్ల చొప్పున.. నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 
 
కానీ ప్రస్తుతం కేంద్రం చొరవ తీసుకోవడంతో రుణాలను మంజూరు చేస్తున్నాయి. సోలార్ ప్యానెళ్ల జీవితకాలం 25 సంవత్సరాల వరకు ఉంటుంది. నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. లోన్ తీసుకొని పెద్ద మొత్తంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. నెలకు ఈజీగా లక్ష రూపాయలు సంపాదించవచ్చు.