బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (14:17 IST)

కోవిడ్19 కొనసాగితే ప్రపంచం ఎలా వుంటుందో ఊహించగలరా?

కోవిడ్19 మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇది మిలియన్ల మందికి సోకింది మరియు వేల మంది చనిపోవటానికి కారణం అవుతోంది. అంతేకాదు కరోనా మనం పని చేసే విధానాన్ని మరియు ఇతరులతో మాట్లాడే విధానాన్ని సైతం మార్చేసింది.

మన దేశంలో కరోనా పరిస్థితి. 
దేశంలో నానాటికి కరోనా వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం మనం గమనించవచ్చు. సమాజం పట్ల బాధ్యత లేని కొంతమంది ప్రజల నిర్లక్ష్యమే కాకుండా కరోన వలన పూర్తి అవగాహన కలిగి ఉండి సురక్షిత చర్యలు ఆచరించకుండా ప్రజల ప్రాణాల పట్ల ప్రమాదకారిగా మారడమే కాకుండా దేశ ఆర్దిక మరియు ఇతర రంగాలు ఛిన్నాభిన్నం అవడానికి దోహదపడేలా తయారయ్యారు.

కొంతమంది ప్రజల బాధ్యతా రాహిత్యం వలన త్వరలోనే మనదేశం కరోన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కరోన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన సమాజంలో విపరీతంగా వ్యాప్తి చెంది ఉద్యోగుల మీద ఆధారపడి పని చేసే ప్రభుత్వ వ్యవస్థలు మరియు ప్రభుత్వం చేసే పోరాట చర్యలకు విఘాతం కలిగేలా చేస్తున్నారు.
కరోనా వైరస్ టెస్ట్

కోవిడ్ వ్యాక్సిన్ యొక్క ప్రస్తుత పరిస్థితి.
నిజ జీవితంలో మన శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించినపుడు కోవిడ్ -19తో ఎలా పోరాడాలో మన  శరీరానికి అప్పుడే తెలుస్తుంది. మన శరీరానికి వైరస్‌ హాని చేయకుండా నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. వైరస్ యొక్క జన్యు సంకేతం తెలుసుకోవడం పూర్తిగా తెలిస్తే అది వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి చాలా సహాయకారిగా ఉంటుంది, కాని ప్రస్తుతం శాస్త్రవేత్తలు వైరస్ యొక్క జన్యు సంకేతం గురించి ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది.

అందువల్ల కోవిడ్‌కు కొంతకాలం వరకు వ్యాక్సిన్‌ను చూడకపోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రజల నిర్లక్ష్యం వలన కోవిడ్ -19 మహమ్మారి మరికొంతకాలం కొనసాగితే మన దేశంలో పరిస్థితులు ఇదివరకు ఉన్న సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయి? టీకా రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? అప్పటివరకు మన జీవితాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఈ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం చాలా సమయం తీసుకుంటే ఏమి జరుగుతుంది?

వైద్య రంగం, పారిశుధ్యం, రక్షణ వ్యవస్థ, ఆర్దిక మరియు ఇతర రంగాలలో మనం ఎన్నో మార్పులు నష్టాలను చూడగలం. ఏది ఏమైనా మన జీవితాలు మాత్రం ఇదివరకు జీవించిన స్థితిలోకి పూర్తిగా తిరిగి వెళ్లతాయని మాత్రం ఆశించలేము. ఒకవేళ కోవిడ్ వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం తీసుకుంటే వైద్య రంగంలో గమనించే మార్పులు ఇలా వుండవచ్చు.
 
ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది తమతమ కుటుంబాలను రోజుల తరబడి వదిలేసి కోవిడ్ పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రజల నిర్లక్ష్యము వలన కేసుల సంఖ్య పెరిగితే చికిత్స కేంద్రాలలో బెడ్లు అందుబాటులో లేక వైద్య సిబ్బంది సరిపోక చికిత్స పొందలేని పరిస్థితులు ఏర్పడతాయి.
corona

పొరపాటున రోగి నుండి వైద్య సిబ్బంది ప్రభావానికి గురైనపుడు వైద్య సిబ్బంది అంతా క్వారంటైన్ లోకి వెళ్ళి చికిత్స కేంద్రం మూసి వేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే చికిత్స కేంద్రాలు సరిపోక ప్రయివేటు సేవలకు వెళ్లవలసి వస్తుంది. ప్రయివేటు చికిత్స సేవల వ్యయం ప్రజలకు మోయలేని భారం అవుతుంది. సామాన్య రోగాలకు సంబంధించి చికిత్స కేంద్రాలను సందర్శించినపుడు ప్రమాదవశాత్తు కోవిడ్ ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి.

మామూలు రోగాలకు సైతం చికిత్స పొందడానికి కోవిడ్ పరీక్ష నిర్వహించబడనిదే చికిత్సను సైతం అందించలేని పరిస్థితులు చికిత్స కేంద్రాల వద్ద ఏర్పడుతుంది. కోవిడ్ రోగులకు రక్షణ సూటు ధరించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీరు తాగే అవకాశం గాని, వాష్ రూమ్ ఉపయోగించుకునే అవకాశం గాని లేకుండా సుమారు 8 గంటల పాటు ప్రతికూల మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో చికిత్స అందించడానికి సంబంధించి సేవల నిమిత్తం నియామకాలకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు.

రోగులు పెరగడం వలన వైద్య సిబ్బందిలో పని ఒత్తిడి పెరిగి విధుల పట్ల నిరాసక్తత, పనితీరు మందగించడం, ఉద్యోగ బాధ్యతల నుండి నిష్క్రమించాలని అనిపించడం వంటి లక్షణాలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రజల అజాగ్రత్త ప్రవర్తన వలన వైద్య సిబ్బందిలో కోవిడ్ మరణాలు పెరిగితే వైద్య సిబ్బందిలో భయాందోళనలు ఏర్పడి కోవిడ్  విధులకు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడవచ్చు.
ప్రజారోగ్య సిబ్బంది లేదా పారిశుధ్య కార్మికులు.
ఒకవిధంగా వైద్య సిబ్బందిలో ఎలాంటి మార్పులు మనం గమనిస్తామో వీళ్లలో కూడా చాలావరకు అదే మార్పులు మనం గమనించవచ్చు. పారిశుధ్య సిబ్బందికి వైద్య సిబ్బంది కంటే ఎక్కువుగా కోవిడ్ ప్రభావానికి గురవుతారు. దీనికి కారణం వైద్య సిబ్బంది ఉపయోగించే రక్షణ కిట్‌లను వీరు వాడరు కనుక. సరైన కారణం లేకుండా రోడ్ల వెంట సంచరించే బాధ్యత లేని ప్రజలు బహిరంగంగా రోడ్ల వెంట ఉమ్మడం వంటి చర్యల వలన వీళ్ళు ఎక్కువ ప్రభావానికి గురవుతారు.

ప్రభావానికి గురై మరణాల శాతం పెరిగితే వాళ్లలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆ ప్రభావం ప్రజారోగ్య నిర్వహణ కార్యక్రమాలలో పడుతుంది. సమాజంలో ప్రజారోగ్య నిర్వహణ సరిగ్గా లేనప్పుడు పారిశుధ్య మరియు ఇతర సమస్యలు ఏర్పడి పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఏర్పడుతుంది.

పోలీసు సేవలలో ఎదురయ్యే ఇబ్బందులు...
బాధ్యతారాహిత్యంగా తిరిగే ప్రజల వలన పోలీసు సిబ్బందికి ముప్పు ఎక్కువుగా ఉంటుంది. విచ్చలవిడిగా కారణం లేకుండా బయట తిరిగే ప్రజల వలన శాంతి భద్రతలు కాపాడే విధుల్లో మరియు రహదారులపై విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
 
ఎక్కువమంది సిబ్బంది వ్యాధి ప్రమాదానికి గురి అయితే ఆ ప్రభావం ప్రజల శాంతిభద్రతలు కాపాడే విషయంలో ప్రభావం పడడమే కాకుండా సిబ్బంది కొరత వలన ప్రజలకు అపత్కాల సందర్భాలు ఎదురైనపుడు సత్వరముగా పోలీసుల సహాయం పొందడం కష్టం అవుతుంది. సమాజంలో వ్యాధి పట్ల ఉన్న భయం వలన పోలీసు సిబ్బంది మరియు ప్రజల మధ్య సత్సంబంధాలు సరిగా నిర్వహించబడలేక పోవచ్చు.

సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు
సమాజంలో ఎవర్ని నమ్మలేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ ఎదుటివానిని వ్యాధి పట్ల అనుమానంగా చూడటం మొదలుపెడతారు. వైరస్ ప్రభావంతో విపరీతంగా పెరిగే మరణాల పట్ల ప్రజల్లో భయాందోళనలు ఏర్పడతాయి.

కోవిడ్‌తో మృతిచెందిన వ్యక్తుల యొక్క మృతదేహాల అంత్యక్రియల కార్యక్రమాల నిర్వహణ కష్టంగా మారవచ్చు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం విధించే నియమాలు తీసుకునే చర్యలు వలన ప్రజలు కొంత అసౌకర్యానికి గురి అవవచ్చు.

షేక్‌ హ్యాండ్‌లు, కౌగిలింతలు మరియు ఇతర రకాలుగా తాకడాలు ఇకపై పబ్లిక్‌లో సాధారణం కాకపోవచ్చు మరియు ప్రభుత్వాలు వాటిని నిషేధించవచ్చు. రద్దీగా ఉండే మాల్స్ లేదా రెస్టారెంట్లలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందని ఊహించుకోకండి.

వాటిల్లో అనుమతించబడే వినియోగదారుల సంఖ్య పరిమితం చేయబడుతుంది. మీ వంతు వరకూ లైన్‌లో వేచి ఉండాల్సి ఉంటుంది. మరియు మీరు ఈ దుకాణాల్లో ఉన్నప్పుడు కనీసం రెండు మీటర్ల లేదా 6 అడుగులు భౌతిక దూరాన్ని ఖచ్చితముగా పాటించవలసి ఉంటుంది. ప్రజలు వ్యాధి సంక్రమణ బారి నుండి తప్పించుకొనటానికి గాను భూగర్భ గృహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
 
నిరుద్యోగ సమస్య.
దేశంలో ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా గాడిలో పెట్టడానికి ప్రభుత్వాలు తమ ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరవడానికి ప్రయత్నిస్తాయి, ఆఫీస్‌లు, సంస్థలు, పరిశ్రమలు దుకాణాలు తిరిగి తెరవబడతాయి. పార్కులు మరియు బీచ్‌లు వంటి బహిరంగ ప్రదేశాలు ప్రజలకు అందుబాటులోకి రావచ్చు. అంతేకాదు పాఠశాలలు సైతం తిరిగి తెరవడానికి అవకాశం ఉంది.

ప్రజలు తిరిగి పనులకు వెళ్ళే సౌలభ్యం ఉంటుంది కానీ నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. ఉదాహరణకు రీటైల్ దుకాణాల్లో మనుషులు చేసే క్రిమిసంహారక పనులను రోబోట్‌లు చేస్తాయి. అలాగే వ్యాధి భయం కారణంగా పరిశ్రమలలో మనుషులుకు బదులుగా రోబోట్ యంత్రాలు వినియోగించబడతాయి, ఆటోమేషన్ ప్రాధాన్యత పెరుగుతుంది. 

పెద్ద సమూహాలు కోవిడ్ -19 వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తాయి కాబట్టి. వ్యక్తి యొక్క ఆరోగ్యం అనుసరించి వారి సంస్థ వారిని తిరిగి నియమించుకోక పోవడం వంటి చర్యల వలన సంస్థ తక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంటుంది. వ్యక్తుల నుండి వైరస్ ప్రమాదము ఉంటుంది కాబట్టి సంస్థల్లో యాంత్రికీకరణ పెరిగి మిలియన్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంటుంది.

చట్టపరమైన చికాకులు అవాంతరాలు...
సంస్థలు గాని మరే ఇతర వ్యవహారాల కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు ఊహించని విధంగా కోవిడ్ వలన హఠాత్తుగా అర్ధంతరంగా మరణిస్తే సంస్థ కార్యక్రమాలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కోవిడ్‌తో మరణం ఊహించని సంఘటన కాబట్టి మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాలపై హక్కుదారుల మధ్య వివాదాలు తెరమీదకి వస్తాయి.

ప్రభుత్వ చర్యలు ఏవిధంగా ఉండబోతాయి?
దేశంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు ప్రభుత్వాలు కొన్ని కఠిన చర్యలకు ఉపక్రమించవచ్చు. ఈ చర్యల్లో భాగంగా ప్రజల యొక్క కదలికలను కఠినంగా నియంత్రించడానికి చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కేవలం ఇళ్లలోనే ఉండాలని ఒక్కోసారి ఆదేశించవచ్చు లేదా ప్రజలు తమ అవసరాల నిమిత్తం లేదా ఉపాధి నిమిత్తం బయటకు రావడానికి అనుమతులను పక్కాగా నిర్వహించవచ్చు.
 
ప్రజలు కోవిడ్ -19 పట్ల తగినంత జాగ్రత్తగా ఉండకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు తగిన సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి తమ పౌరుల కదలికలను వివిధ పద్దతులు అయిన బ్యాంక్ రికార్డులు, ఏ‌టి‌ఎంలు, వివిధ రకాల చెల్లింపులు మరియు వారి ఫోన్ వాడకాన్ని ఆధారంగా చేసుకుని ట్రాక్ చేయడం ప్రారంభించవచ్చు.
 
కారణం లేకుండా అనవసరంగా బయట ఎవరు తిరుగుతున్నారు, లేదా అనుమతించని పెద్ద సమావేశాలలో ఎవరు పాల్గొన్నారు, లేదా అనుమతించిన కార్యక్రమాలలో అనుమతించిన వ్యక్తులకంటే ఎక్కువ ఎవరు పాల్గొన్నారో ట్రాక్ చేసి అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత పెరుగుతుంది.
 
అనేక మందికి పైగా వైద్యులు మరియు శాస్త్రవేత్తల బృందాలు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాయి, కొన్ని ప్రస్తుతం మానవులలో పరీక్షించబడుతున్నాయి. వ్యాక్సిన్ పనితనం విజయవంతం అయ్యాక అది ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయాలి.

ఈ లోపు ప్రజలలో వైరస్ వ్యాప్తి చెందకుండా టీకా కాకుండా కోవిడ్ -19 తో పోరాడటానికి మంచి మార్గం ఏదేనా ఉందా అంటే కేవలం బయటకు వచ్చినప్పుడు మొహానికి మాస్కు మరియు వ్యక్తికి వ్యక్తికి మధ్య తగిన దూరం నిర్వహించడం మాత్రమే.