శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జులై 2020 (09:40 IST)

ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

దేశరాజధాని దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా పిలుస్తున్న దీన్ని ఆదివారం లెఫ్టినెంట్‌ గర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రారంభించారు.

10వేల పడకలతో దీన్ని ఏర్పాటు చేశారు. నోడల్‌ ఏజెన్సీగా ఆస్పత్రిని ఐటీబీపీ నిర్వహిస్తోంది. రాధా సోమి బియాస్‌ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన కొంతమంది స్వచ్ఛందంగా సేవలందించనున్నారు.

ఛత్తర్‌పూర్‌లో 70ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 20 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.