శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (13:04 IST)

రాజా రామ్ మోహన్ రాయ్ జయంతి-బాల్యవివాహాలు, సతీసహగమనంకు గండికొట్టారు..

Raja Ram Mohan Roy
Raja Ram Mohan Roy
మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రాజా రామ్మోహన్ రాయ్ పుట్టినరోజు నేడు. 1772 సంవత్సరం మే 22న బెంగాల్ ప్రెసిడెన్సీలోని రాధనగర్ హూగ్లీలో వైష్ణవ కుటుంబంలో రామ్మోహన్ రాయ్ జన్మించారు.
 
రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, బెంగాలీ, అరబిక్, పర్షియన్ భాషల్లో నిపుణులు. దేశంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయడంలో విజయవంతం అయ్యారు. 1828లో ఈయన బ్రహ్మ సమాజ్‌ను స్థాపించారు. 
 
వితంతు పునర్వివాహాలు జరిపించడంతోపాటు స్త్రీ విద్య కోసం ఆయన విశేష కృషి చేశారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగం పొందడంతోపాటు ఆ భాష వల్ల శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని భావించారు. అందుకే మనదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. 
 
మెఘల్ చక్రవర్తి తరఫున రాయబారిగా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ వెళ్లారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లడానికి ముందే మొఘల్ చక్రవర్తి ఆయనకు "రాజా" బిరుదునిచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉండగానే మెదడువాపు వ్యాధితో 1833 సెప్టెంబర్ 27న బ్రిస్టల్ నగరంలో రాయ్ మరణించారు.