సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By కుమార్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:42 IST)

నారా లోకేష్ పోటీచేసే లొకేషన్‌పై క్లారిటీ.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ

ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయంపై ఇన్నాళ్లూ ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. తొలుత విశాఖ జిల్లా భీమిలి లేదా విశాఖ ఉత్తరం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్లుగానే ఆ స్థానాల్లోని ఆశావహులు మిన్నకుండిపోయినట్లు సమాచారం.
 
అయితే విస్తృత చర్చల అనంతరం నారా లోకేష్‌ను రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి వేగంగా జరగాలన్నా, ఆ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంట ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలంటే లోకేష్‌ను అక్కడి నుండి పోటీలోకి దింపాలని పార్టీ నిర్ణయించిందని సమాచారం. 
 
ప్రస్తుతం నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఉండగా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. పోటీ స్థానాన్ని నిర్ధారించిన వెంటనే లోకేషన్ మంగళగిరిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఉన్నారు.