మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 2 మే 2017 (10:26 IST)

ఆర్కే.రోజా మా కొద్దు బాబోయ్... ఈ మాట ఎవరంటున్నారు?

సినీనటి రోజా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలిముద్దుక్రిష్ణమనాయుడుపైనే గెలుపొందారు. అయితే గెలుపొందడం ఒక్కటే ఆ తర్వాత నగరి నియోజవకర్గంలో పర్యటించ

సినీనటి రోజా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలిముద్దుక్రిష్ణమనాయుడుపైనే గెలుపొందారు. అయితే గెలుపొందడం ఒక్కటే ఆ తర్వాత నగరి నియోజవకర్గంలో పర్యటించింది చాలా తక్కువంటున్నారు నగరి ప్రజలు. వారే కాదు వైసిపి నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరిస్తున్నారు కూడా. 
 
ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన రోజా.. పెద్దగా నియోజవర్గంపై దృష్టిపెట్టలేదంటున్నారు. కొంతమంది వైసిపి నేతలైతే తాజాగా రోజా మా కొద్దు బాబోయ్ అంటూ ఏకంగా అధినేతకే ఫిర్యాదులు చేస్తున్నారట. 
 
నగరికి చెందిన 30 మందికిపైగా వైకాపా నేతలు హైదరాబాద్‌కు బయలుదేరడానికి సిద్ధమయ్యారట. రోజా విషయంపై అధినేత దృష్టికి తీసుకెళ్ళాలని, ఎమ్మెల్యేకి కావాల్సిన నిధులు వస్తున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో, పూర్తిస్థాయిలో రోజా దృష్టి పెట్టకపోవడంతో నియోజకవర్గ సమస్య అంతంత మాత్రంగా మారిందనేది వారి ఆవేదన. ప్రతి ప్రాంతంలో వైకాపా నేతలను ప్రజలు ప్రశ్నించడంతో చేసేది లేక రోజాపైనే ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. 
 
మరోవైపు ప్రభుత్వం కూడా నగరి నియోజవర్గానికి అనుకున్నంత నిధులు కూడా ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. మొత్తం మీద పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న ఆర్కే. రోజా వ్యవహారంపై అధినేత జగన్ ఏవిధంగా స్పందింస్తారో వేచి చూడాలి.