గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (18:38 IST)

వైఎస్ ఇంట్లో పెళ్లి బాజాలు- షర్మిల కుమారుడి ప్రేమ వివాహం.. ఎప్పుడు?

YS Sharmila
YS Sharmila
గత కొన్నాళ్లుగా అమెరికాలో చదువుకుంటున్న వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. దీంతో వైఎస్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రియా అట్లూరితో రాజా కులాంతర వివాహానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
ప్రియా అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలు, ఆమె కూడా అమెరికాలో చదువుతోంది. రాజా రెడ్డి- ప్రియ గత నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారనుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో హై ప్రొఫైల్ పెళ్లిళ్లలో ఇది ఒకటి కానుంది.