ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మే 2024 (22:09 IST)

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Akshaya Tritiya 2021
అక్షయ అంటేనే నాశనం లేనిది.. అంతులేనిది.. తరిగిపోనిది అని అర్థం వస్తుంది. ఇదే రోజున ఇంకా ఎన్నో శుభకార్యాలు కూడా చేస్తుంటారు. 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ మే 10న ఉదయం 4.17 గంటలకు ప్రారంభం అవుతుంది. 
 
ఇది మే 11న తెల్లవారుజామున 2.50 గంటలకు ముగుస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం ఏ సమయంలో కొనాలనేది కూడా ఉంటుంది. 2024, మే 10 తెల్లవారుజాము 5.33 నుంచి మే 11న ఉదయం 2.50 గంటలుగా ఉంది.
 
శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజూ ఇదేనని చెప్తారు. ఈ రోజున దాన, ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో వుంది. ఈ రోజు చేసిన హోమాలు, దానాలు శుభ ఫలితాలు చేకూరుతాయి.