మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2025 (16:40 IST)

జీఎస్టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన వాహనాల ధరలు

Lexus cars
దేశ వ్యాప్తంగా వాహనాల ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కార్లు, ద్విచక్రవాహనాల ధరలతో పాటు ఏకంగా 375 రకాలైన వస్తువుల ధరలు తగ్గాయి. కొత్త పన్ను విధానం సోమవారం నుంచి అమల్లోకి రావడంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. దీంతో వాహన రంగంలో అతిపెద్ద ధరల తగ్గింపు నమోదవుతుంది. 
 
సాధారణంగా ఎంట్రీ లెవల్ హ్యాచ్ బైకులపై సుమారుగా రూ.40 వేల మొదలుకుని ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలపై ఏకంగా రూ.30 లక్షల వరకు ధరలు దిగిరావడం విశేషం. దీంతో కొత్త వాహనం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
350 సీసీ లోపు బైకులపై భారీ ఊరట లభించింది. దేశంలో దాదాపు 98 శాతం మార్కెట్ వాటా కలిగిన 350 సీసీ లోపు స్కూటర్లు, మోటార్ సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో హీరో స్పెండర్, హోండా యాక్టివా, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి అత్యంత ప్రజాధారణ కలిగిన మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. హోండా తన యాక్టివాపై సుమారు రూ.7874, సీసీ 350 బైకుపై రూ.18887 వరకు తగ్గించింది. అలాగే, మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకీ వంటి కార్ల ధరలు రూ.లక్షల్లో తగ్గడం గమనార్హం.