బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (09:49 IST)

త‌క్కువ వ‌డ్డీరేటుకు ప‌ర్స‌న‌ల్ లోన్, వివరాలు ఇక్కడ...

చాలా మంది స్వ‌ల్ప‌కాలిక ఆర్థిక అవ‌స‌రాల కోసం ప‌ర్స‌న‌ల్ లోన్లు తీసుకుంటారు. మీ అవ‌స‌రాల‌ను బ‌ట్టి, మీ ఆదాయ వ‌న‌రుల‌ను బ‌ట్టి ఒక బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు. ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకునేవారు పే స్లిప్‌లు, ఐటీఆర్ ఫామ్‌, ఇత‌ర లోన్ అప్రూవ్డ్ ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఒక‌వేళ లోన్ అప్లికేష‌న్ ఆమోదం పొందితే 2-7 రోజుల్లోనే ప‌ర్స‌న‌ల్ లోన్ల పంపినీ పూర్త‌వుతుంది. ప్రీ-అప్రూవ్డ్ లోన్ల విష‌యంలో కొన్ని బ్యాంకులు తొంద‌ర‌గానే ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదిస్తాయి.
 
బ్యాంకు వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివ‌రాల మేర‌కు ప‌ర్స‌న‌ల్ లోన్ పొంద‌డానికి అర్హులైతే.. అందుకు సంబంధించిన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మీకు నెల‌వారీగా వ‌చ్చే ఆదాయంపై ఆధార‌ప‌డి బ్యాంకులు ప‌ర్స‌న‌ల్ లోన్లు గ‌రిష్ఠ స్థాయిలో ఇస్తాఇ. మీ ఆదాయాన్ని బ‌ట్టి భార‌త్‌లో రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు. అదీ కూడా మీ ఆదాయంతోపాటు క్రెడిట్ హిస్ట‌రీ, క్రెడిట్ స్కోర్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.
 
ప‌ర్స‌న‌ల్ లోన్‌పై వ‌డ్డీరేటు ఇలా..
ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌డ‌మూ తిరిగి చెల్లించ‌డం తేలిక‌. సిబిల్ స్కోర్‌ను బ‌ట్టే వ‌డ్డీరేటు ఖ‌రార‌వుతుంది. సాధార‌ణంగా ప‌ర్స‌న‌ల్ లోన్ల‌పై వార్షిక ప్రాతిప‌దిక‌న 10-24శాతం మ‌ధ్య ఉంటుంది. అదీ క్రెడిట్ ప్రొఫైల్‌తోపాటు పేమెంట్ హిస్ట‌రీ, ఉద్యోగి, ఆయ‌న ప‌ని చేస్తున్న సంస్థ యాజ‌మాన్యం త‌దిత‌ర అంశాల‌పై ఇది ఆధార‌ప‌డుతుంది.
 
ప‌ర్స‌న‌ల్ లోన్ వ‌డ్డీ ఖ‌రారుకు ఇలా..
స్వ‌యం ఉపాధి లేదా వేత‌నంపై ప‌ని చేస్తున్న మీ నెల‌వారీ ఆదాయాన్ని బ‌ట్టి ఆన్‌లైన్‌లో ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మీ క్రెడిట్ స్కోర్‌ను బ‌ట్టి మీరు తీసుకునే ఆన్‌లైన్ రుణాల‌పై వ‌డ్డీరేటు ఖ‌రార‌వుతుంది. మీ యాజ‌మాన్యానికి గ‌ల ప‌ర‌ప‌తి కూడా ముఖ్య‌మే.
 
క్రెడిట్ స్కోర్.. రుణాల రీ పేమెంట్‌
క్రెడిట్ స్కోర్‌తోపాటు గ‌తంలో తీసుకున్న రుణాల‌ను బ‌ట్టి మీ ప‌ర్స‌న‌ల్ లోన్‌పై వ‌డ్డీరేటు నిర్ణ‌యం అవుతుంది. సంబంధిత బ్యాంకు శాఖ‌తో మీకు గ‌ల అనుబంధం కూడా వ‌డ్డీరేటు ఖ‌రారులో కీల‌కమౌతుంది.
 
క్రెడిట్ స్కోర్‌ను బ‌ట్టే..
క్రెడిట్ స్కోర్‌ను బ‌ట్టే మీరు స‌మ‌ర్థులా.. కాదా.. అన్న సంగ‌తి తేలిపోతుంది. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే త‌క్కువ వ‌డ్డీరేటుపై ప‌ర్స‌నల్ లోన్ పొంద‌డం తేలిక‌. క్రెడిట్ స్కోర్‌, పాత రుణ చెల్లింపుల హిస్ట‌రీని బ‌ట్టి మీకు మంజూర‌య్యే లోన్ మొత్తం, దాని విధి విధానాలు నిర్ణ‌య‌మ‌వుతాయి. అధిక క్రెడిట్ స్కోర్ కొన‌సాగిస్తూ ఉంటే త‌క్కువ వ‌డ్డీరేటుపైనే ప‌ర్స‌నల్ లోన్ పొందొచ్చు.
 
తాక‌ట్టుపై లోన్ తీసుకోవ‌డ‌మే బెస్ట్‌
సేవింగ్స్ ఖాతా, స‌ర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ స‌మ‌ర్పించి సెక్యూర్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్ పొందడం తేలిక‌. అన్ సెక్యూర్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్ పొంద‌డం తేలికైనా బ్యాంక‌ర్లు తాక‌ట్టు పెట్టుకునే ప‌ర్స‌న‌ల్ లోన్ ఇస్తారు. తాక‌ట్టు లేని రుణాల‌పై వ‌డ్డీరేటు ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక తాకట్టు ఉంటేనే త‌క్కువ వ‌డ్డీపై ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను బ్యాంకులు మంజూరు చేస్తాయి.
 
బ్యాంకుల్లో రుణాల‌కు ప్రియారిటీ
ఆర్థికేత‌ర బ్యాంకింగ్ సంస్థ‌ల‌ (ఎన్బీఎఫ్‌సీ) వ‌ద్ద‌కంటే బ్యాంకుల్లో ప‌ర్స‌న‌ల్ లోన్లు తీసుకోవ‌డం మేలు. బ్యాంకుల్లో త‌క్కువ వ‌డ్డీరేటుపై వ్య‌క్తిగ‌త రుణాలు మంజూర‌వుతాయి. ఎన్బీఎఫ్‌సీలో త్వ‌రిత‌గ‌తిన రుణం ఆఫ‌ర్ చేస్తారు. ఎన్బీఎఫ్‌సీలు లేదా ప్రైవేట్ బ్యాంక‌ర్లు అధిక వ‌డ్డీరేటు వ‌సూలు చేస్తాయి.
 
చెల్లింపు కాలాన్ని బ‌ట్టే వ‌డ్డీరేట్లు ఖ‌రారు
ప‌ర్స‌న‌ల్ రుణాల చెల్లింపు కాలాన్ని బ‌ట్టి వాటిపై విభిన్న వ‌డ్డీరేట్లు ఖ‌రారు చేస్తాయి బ్యాంకులు.. సుదీర్ఘ కాలం వాయిదాలు కొన‌సాగితే ఎక్కువ వ‌డ్డీరేటు ప‌డుతుంది. త‌క్కువ కాల‌మైతే వ‌డ్డీరేటు చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ప‌ర్స‌న‌ల్ లోన్‌ను ఏడాది నుంచి ఐదేండ్ల లోపు తీర్చొచ్చు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల వ‌ద్ద ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేయొద్ద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనివ‌ల్ల ప‌లు ర‌కాల క్రెడిట్ ఎంక్వైరీలు కూడా ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను రిస్క్‌గా మార్చేస్తాయి.