Daily Horoscope
✕

శరీరంలో క్యాల్షియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?

Updated: మంగళవారం, 12 మార్చి 2019 (15:12 IST)
హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యే. ఈ వ్యాధుల కారణంగా రక్తనాళాల గోడలు మందంగా మారి రక్తప్రసరణపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. పొగ పీల్చడం, ఆల్కహాల్ సేవించడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ కూర్చుని పనిచేయడం వంటి అలవాట్లు హైబీపీకి దారితీస్తాయి. హైపర్ టెన్షన్ నియంత్రించడానికి క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో తీసుకోవాలి. 
 
శరీర వ్యవస్థలను నియంత్రించడంలో మెగ్నిషియం తోడ్పడుతుంది. బీపీ, షుగర్ స్థాయిలతోపాటు కండరాలు, నరాల వ్యవస్థలను నియంత్రించడంలో మెగ్నిషియం ఎంతో ఉపకరిస్తుంది. మూత్రం ద్వారా పొటాషియం, మెగ్నిషియంలను శరీరం భారీగా కోల్పోతుంది. కాబట్టి మెగ్నిషియం స్థాయిలను పెంచుకోవడం కోసం అరటి పండ్లు, అవకాడో, నట్స్, బ్లాక్ బీన్స్, బచ్చలి కూరలను ఎక్కువగా తీసుకోవాలి. 
 
ఎముకలను దృఢంగా ఉంచడంతోపాటు హైపర్ టెన్షన్‌‌ను అరికట్టడానికి క్యాల్షియం ఎంతో అవసరం. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి హైబీపీ ముప్పు ఎక్కువ. శరీర క్రియలు సజావుగా సాగడానికి అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్‌ల విడుదలలో క్యాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, వన్న, చేపలు, ఆకుకూరల్లో క్యాల్షియం విరివిగా లభిస్తుంది. 

అన్నీ చూడండి

నీటిని వృధా చేసిన జూబ్లీహిల్స్‌ హోటల్‌కు రూ.20వేల జరిమానా

మద్యపానం మానేయమని చెప్పిన భార్య... ముక్కుపై దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్

దసరా పండుగ దృష్ట్యా 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్న టీజీఎస్సార్టీసీ

కర్నాటక మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ : సీఎం డీకే శివకుమార్ వార్నింగ్

మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీ.. డ్రగ్స్ వద్దు బ్రో.. నారా లోకేష్

అన్నీ చూడండి

director Maruthi : దర్శకుడు దాసరి మారుతి పుట్టినరోజు సందర్భంగా కొత్త నిర్ణయం తీసుకున్నాడా ?

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఇకలేరు.. గోవా నివాసంలో అనుమానాస్పద మృతి

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా

Balakrishna: బాలయ్యతో మళ్లీ జతకట్టనున్న విజయశాంతి?

Master Arun: సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments