శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 1 అక్టోబరు 2024 (23:15 IST)

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

Doctor Jyothy
అరుదైన మరియు సంక్లిష్టమైన సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతున్న 29 ఏళ్ల యువతికి హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌ గైనకాలజీ విభాగం విజయవంతంగా చికిత్స అందించింది. ఈ రోగికి రెండు రోజులుగా కడుపు నొప్పి మరియు అసాధారణమైన రీతిలో  జననేంద్రియాల నుంచి అధిక రక్తస్రావమవుతుందనే  సమస్యతో హాస్పిటల్ కు వచ్చారు. ఆమెను పరీక్షించిన తర్వాత, ఆమె మునుపటి సిజేరియన్ సమయంలో చేసిన కోత దగ్గర ఎక్టోపిక్ గర్భం పెరుగుతున్నట్లు కనుగొనబడింది, ఇది అరుదైన మరియు ప్రాణాంతక పరిస్థితి.
 
ప్రసూతి మరియు గైనకాలజీ  నిపుణురాలు డాక్టర్ జ్యోతి కంకణాల నేతృత్వంలో రోగికి లాపరోస్కోపిక్ స్కార్ ఎక్టోపిక్ ఎక్సిషన్ మరియు రిపేర్ చికిత్స చేశారు. "సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ గర్భాలు చాలా అరుదు, మొత్తం ఎక్టోపిక్ గర్భాలలో 1% కంటే తక్కువ మందిలో ఇవి సంభవిస్తాయి" అని డాక్టర్ కంకణాల చెప్పారు. "ఈ తరహా సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే, గర్భాశయ చీలిక, అధిక రక్తస్రావం మరియు అరుదైన సందర్భాల్లో, హిస్టెక్టమి  (స్త్రీ గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స) అవసరమవుతుంది. అదృష్టవశాత్తూ, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా ఎక్టోపిక్ కణజాలాన్ని తొలగించి, గర్భాశయ లోపం సరిచేయడం జరిగింది. భవిష్యత్తులో రోగికి పిల్లలు పుట్టే అవకాశాలను సైతం కాపాడాము" అని అన్నారు. 
 
రోగి శస్త్రచికిత్సకు బాగా ప్రతిస్పందించారు, శస్త్రచికిత్స అనంతర పెద్దగా నొప్పిని అనుభవించలేదు. మూత్రం మరియు మలం రెండింటినీ పాస్ చేయగలిగారు. ఇన్ఫెక్షన్ సంకేతాలు లేదా మరిన్ని సమస్యలు ఏమీ కనిపించలేదు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ప్రక్రియ విజయవంతంగా ఎక్టోపిక్ కణజాలాన్ని తొలగించినప్పటికీ, సమస్య పునరావృతం కాకుండా లేదా ఇతర సమస్యల బారిన పడకుండా నిరంతర పర్యవేక్షించాల్సిన ఆవశ్యకతను డాక్టర్ కంకణాల నొక్కి చెప్పారు. "పునరావృత సమస్య  ప్రమాదాన్ని అంచనా వేయలేము, లేదా శస్త్రచికిత్స అనంతర రక్తస్రావం పూర్తిగా తోసిపుచ్చలేము, అయినప్పటికీ ఈ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని సమస్యలు ఎదురవుతాయని మేము భావించటం లేదు "  అని  డాక్టర్ గారు వెల్లడించారు. 
 
సిటిఎస్ఐ - దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది, ఈ తరహా సందర్భాలలో సకాలంలో రోగ నిర్ధారణ మరియు అధునాతన శస్త్రచికిత్స జోక్యాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. "అత్యాధునిక వైద్య సంరక్షణను అందించడంలో మా నిబద్ధత,  ఈ అరుదైన కేసును నిర్వహించడంలో ప్రదర్శించబడిన నైపుణ్యం ద్వారా ఉదహరించబడింది. మా వైద్య బృందాల అంకితభావం, ముఖ్యంగా క్లిష్టమైన, అధిక-ప్రమాదకర పరిస్థితుల్లో రోగులకు అత్యున్నత స్థాయి సంరక్షణను అందజేస్తుందనే భరోసా అందిస్తుంది" అని అన్నారు. 
 
సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ సి ఓ ఓ డాక్టర్ ప్రభాకర్ పి. మాట్లాడుతూ, "ఈ కేసు మా వైద్య బృందం యొక్క అసాధారణ నైపుణ్యాన్ని మరియు మేము ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను వెల్లడిస్తుంది. సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి సంక్లిష్ట కేసులను నిర్వహించడానికి లాపరోస్కోపిక్ విధానాలు కీలకంగా మారుతున్నాయి. ఈ  అత్యాధునిక సాంకేతికతలు, ఈ తరహా  క్లిష్టమైన పరిస్థితులను ఖచ్చితత్వంతో మరియు జాగ్రత్తతో పరిష్కరించడానికి మాకు అనుమతిస్తాయి, మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను నిర్ధారిస్తాయి" అని అన్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా గర్భిణిలలో దాదాపు 1-2% మందిలో ఎక్టోపిక్ గర్భాలు సంభవిస్తాయి. వీటిలో, సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ గర్భాలు చాలా అరుదు. అయితే, సిజేరియన్ ప్రసవాలు పెరగడం వల్ల గత దశాబ్ద కాలంగా ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతుంది. ముందుగా సమస్యను గుర్తించడం మరియు శస్త్రచికిత్స ద్వారా సమస్యను నిర్వహించటం చాలా ముఖ్యం, చికిత్స చేయని కేసులు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. చీలిక, రక్తస్రావం మరియు ప్రసూతి మరణాలతో సహా మరెన్నో సమస్యలకూ కారణమవుతుంది.