ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 సెప్టెంబరు 2023 (10:33 IST)

మధుమేహాన్ని తగ్గించగల పదార్థాలు ఇవే

neem
మధుమేహం. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి.
 
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల మరొకటి మెంతులు, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి.
ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
 
రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి. మధుమేహాన్ని కలబంద అడ్డుకుంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
 
షుగర్ వ్యాధిని అడ్డుకోవడంలో సాయపడే మరో చక్కని దినుసు దాల్చిన చెక్క. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల శక్తి కాకర కాయకు వుంది.