శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (23:05 IST)

కాలేయాన్ని పాడు చేసే పదార్థాలు ఇవే...

ఈ రోజుల్లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం అలవాటైంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం కూడా వస్తుంది.


దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి.

 
సోడా, ఇతర కార్బోనేటేడ్ పానీయాలు తీవ్రమైన కాలేయ సమస్యలను కలిగిస్తాయి. ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అదే సమయంలో, ఈ కార్బోనేటేడ్ పానీయాలు కూడా ఊబకాయం సమస్యకు దోహదం చేస్తాయి. చక్కెర నూనె, పిండి వంటి శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా కాలేయానికి హానికరం. ఈ పదార్థాలు శరీరంలో క్యాన్సర్ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. కనుక ఇలాంటి పదార్థాలకు దూరంగా వుండాలి.