సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (14:09 IST)

మార్కెట్లోకి మహీంద్రా AX7.. ఫీచర్స్ గురించి తెలుసా?

AX7
అక్టోబర్ 2021లో, మహీంద్రా టాప్-స్పెక్ XUV700 AX7 లగ్జరీని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ నెల ప్రారంభంలో, XUV700 AX7 AWD డెలివరీలు ప్రారంభమయ్యాయి. 
 
లగ్జరీ ప్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో, కస్టమర్ డిమాండ్ మేరకు కొత్త వేరియంట్‌లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.
 
మహీంద్రా XUV700 లగ్జరీ ప్యాక్ వేరియంట్‌లు సోనీ ద్వారా 3D సౌండ్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, డ్రైవర్ మోకాలి ఎయిర్‌బ్యాగ్, ఎలక్ట్రికల్‌గా అమర్చబడిన స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, కంటిన్యూస్ డిజిటల్ రికార్డింగ్ కలిగివుంటుంది.
 
అలాగే డ్రైవర్ మోకాలి ఎయిర్‌బ్యాగ్, పాసివ్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను అందిస్తాయి. వైర్లెస్ ఛార్జింగ్. ఇంకా డీజిల్ వెర్షన్ 2.2-లీటర్ కామన్‌రైల్ టర్బో డీజిల్ mHawk ఇంజిన్‌తో ఆధారితమైనది.