అధిక కొలెస్ట్రాల్ 7 లక్షణాలు ఏమిటి?
అధిక కొలెస్ట్రాల్. శరీరంలో పేరుకుపోయే చెడ్డ కొవ్వు వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానివల్ల ప్రధానంగా గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతాయి. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరిందని తెలిపే కొన్ని లక్షణాల ద్వారా గమనించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
ఎడమ వైపు తరచుగా ఛాతీ నొప్పి వస్తుంటుంది.
గుండె జబ్బులు, స్ట్రోక్ లేదా ఇతర రక్త నాళాలలో అథెరోస్క్లెరోసిస్ లక్షణాలు కనబడతాయి.
తీవ్రమైన మానసిక ఒత్తిడి కనబడుతుంది.
నడుస్తున్నప్పుడు తడబడుతున్నట్లు అంటే అస్థిరమైన నడక వుంటుంది.
మాట్లాడేటపుడు మాటల్లో కూడా అస్పష్టమైన ప్రసంగం కనబడుతుంది.
దిగువ కాళ్ళలో నొప్పి సమస్య వస్తుంది.
అధిక రక్తపోటు సమస్య కూడా కనబడుతుంది.
పైన తెలిపిన పరిస్థితులలో ఏవైనా కనబడితే అది అధిక కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉండవచ్చు.