ఆదివారం, 19 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (15:24 IST)

బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమిటి? తీసుకోవలసిన జాగ్రత్తలు

Bird flu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. నెల్లూరు, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వున్నట్లు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము.
 
బర్డ్ ఫ్లూ లక్షణాల్లో జ్వరం లేదా జ్వరం అనుభూతి కనిపిస్తుంది.
దగ్గు, గొంతు మంటగా వుంటుంది.
ముక్కు కారటం, కండరాలు లేదా శరీర నొప్పులు వుంటాయి.
తలనొప్పితో పాటు అలసటగా వుంటుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి.
చేతులు కడుక్కోవడం, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు గుడ్డలు అడ్డుపెట్టుకుంటే ముప్పును తగ్గించుకోవచ్చు.
భోజనం చేసేటప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించేటప్పుడు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.
చనిపోయిన, జబ్బు పడిన పక్షుల దగ్గరకు పోకూడదు.