బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 23 డిశెంబరు 2022 (23:39 IST)

ఉబ్బసం- ఆస్తమాను తెచ్చే ఆహారం ఏంటి?

ఆస్తమా సమస్య వున్నవారికి శీతాకాలంలో చల్లని గాలి మహా చెడ్డది. ఇది శ్వాసనాళాల గొట్టాలను చికాకుపెడుతుంది. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఆస్తమా వేటివల్ల వస్తుందో తెలుసుకుందాము.
 
ఆస్తమా ఉన్నట్లయితే, చల్లని శీతాకాలపు వాతావరణంలో వీలైనంత వరకు తిరగకుండా ఇంట్లోనే ఉండడం మంచిది.
 
పొగాకు పొగ, దుమ్ము, వాయు కాలుష్యం, బొద్దింకలు, ఎలుకలు, పెంపుడు జంతువులు,
శుభ్రపరచడం, క్రిమిసంహారక మందులు ఆస్తమాకి కారణం కావచ్చు.
 
కొన్ని రకాల విత్తనాలు, గోధుమలు, సోయా, వేరుశెనగలు, గుడ్లు, చేపలు, ఆవు పాలు చాలా వరకు అలెర్జీలను ప్రేరేపించేవిగా వుంటాయి.
 
ఆస్తమా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, పిల్లికూతలు, ముక్కు దిబ్బడ, కళ్ళు దురద, దద్దుర్లు ఉంటాయి.
 
ఉబ్బసం చికిత్సకు ఉపయోగించే రెండు ప్రధాన రకాల మందులు ఉన్నాయి.
 
ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ వంటి దీర్ఘకాలిక నియంత్రణ మందులు మొదటిరకం.
 
రెండోది త్వరిత-ఉపశమన ఇన్హేలర్లు వంటి వేగంగా పనిచేసేవాటిని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

 
ఆస్తమా మరింత ఎక్కువగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.