ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 9 డిశెంబరు 2020 (22:48 IST)

వక్క పొడి అతిగా తీసుకుంటే ఏమవుతుంది?

వక్క పొడిని నమిలే అలవాటు కొందరికి వుంటుంది. ఈ వక్కతో మంచి ఎంత వుందో చెడు కూడా అంతే వుంది. వక్కలో వుండే చెడు గుణాలు ఏమిటో చూద్దాం. వక్కలలో ఆల్కలాయిడ్స్, టానిన్లు శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం.
 
తరచుగా వక్కలు - ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని, కేన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు. అదేపనిగా వక్క నమలడం వలన మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.
 
వక్కలు, వక్కపొడిని గర్భిణిలు, బాలింతలు తీసుకోకూడదు. బిడ్డకు, తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదం ఉంది. 18 ఏళ్ల లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోరాదు. వక్కలు ఒక రకమైన మత్తును, హాయిని కలిస్తాయి కనుకనే వీటికి బానిసలయ్యే ప్రమాదము లేకపోలేదు.