శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 11 నవంబరు 2023 (21:57 IST)

మగవారికి అద్భుతంగా ఉపయోగపడే అశ్వగంధ లేహ్యం

Ashwagandha
అశ్వగంధ. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత వుంది. హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే, శక్తి స్థాయిని పెంచే పొటాషియం, క్యాల్షియం ఇందులో సమృద్దిగా ఉన్నాయి. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసారాన్ని మెండుగా అందించే విటమిన్ ఇ అశ్వగంధలో హెచ్చుగా ఉంది. అశ్వగంధ లేహ్యం మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగాను చెపుతారు.
 
మహిళల్లో రొమ్ము- అండాశయ క్యాన్సర్‌కు చికిత్స చేయడంలో అశ్వగంధ సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని నివారించడంలోనూ, నీరసాన్ని, నిస్త్రాణని దగ్గరకి రానివ్వకుండా చేస్తుంది. అశ్వగంధ చూర్ణంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి కనుక ఇది ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది.
 
అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది. అశ్వగంధ చూర్ణం ద్వారా స్త్రీ-పురుషుల సమస్యల నుంచి ఉపశమనం పొందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.