మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (12:56 IST)

పొట్టలో పేరుకుపోయిన కొవ్వుతో మహిళలకు ఆ ముప్పు తప్పదట?

మహిళల్లో బరువు ప్రమాదకరం.. అది క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పొట్టలో పేరుకుపోయిన కొవ్వు ద్వారా మహిళల్లో ఎక్కువ శాతం మందికి క్యాన్సర్ ఏర్పడే అవకాశాలున్నట్లు పరిశోధకులు

మహిళల్లో బరువు ప్రమాదకరం.. అది క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పొట్టలో పేరుకుపోయిన కొవ్వు ద్వారా మహిళల్లో ఎక్కువ శాతం మందికి క్యాన్సర్ ఏర్పడే అవకాశాలున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పోస్ట్ మేనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని హార్మోనుల్లో మార్పుల కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందని వారు చెప్తున్నారు. 
 
నిరంత శ్రమ, నిద్రలేమితో పాటు గంటల పాటు కూర్చుంటున్న మహిళల్లో ఈ రిస్క్ అధికంగా వుంటుందని అంటున్నారు. పొట్టలో పేరుకుపోయే కొవ్వు ద్వారా గర్భాశయం దెబ్బతింటుందని తద్వారా కాలేయం, ఓవరియన్ క్యాన్సర్లు సోకే ప్రమాదం వుంది. డెన్మార్క్ ఆధారిత బయోటెక్నాలజీ ఫామ్ నిర్వహించిన పరిశోధనలో ఊబకాయులైన మహిళల్లో క్యాన్సర్ కారకాలు అధికంగా వున్నట్లు తేలింది.
 
ముఖ్యంగా పొట్టలో కొవ్వు చేరిన మహిళల్లో ఈ ప్రమాదం అధికంగా వుందని పరిశోధకులు అంటున్నారు. అందుచేత ఒబిసిటీకి తప్పకుండా మహిళలు దూరంగా వుండాలని డెన్మార్క్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బరువును తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయాలని, ఇన్సులిన్ స్థాయిల్ని సక్రమంగా వుంచుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునన్నారు. 
 
ఈ క్రమంలో బంగాళాదుంపలు, గోధుమలు, అన్నం, మొక్కజొన్నలను మితంగా తీసుకోవాలని తద్వారా ఇన్సులిన్ స్థాయిని పెరగనీయకుండా చూసుకోవచ్చునని  పరిశోధకులు సూచిస్తున్నారు. పోషకాహారంతో కూడిన ఆహారం, వ్యాయామం వంటివి చేస్తే ఒబిసిటీ దూరమవుతుందని.. తద్వారా ప్రాణాంతక వ్యాధులు సోకే అవకాశాలుండవని వారు చెప్తున్నారు.