గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 జులై 2024 (23:09 IST)

పరగడుపున తేనె కలిపిన నిమ్మరసం తాగితే?

lemon
పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది. నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. 
మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం.
 
నిమ్మకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి వుంటుంది.
భోజనానికి ముందు గ్లాసు నిమ్మరసం తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని 45 నిమిషాల్లో తగ్గించవచ్చు.
అన్నం, బంగాళదుంపలపై నిమ్మరసం పిండుకుని తింటే చాలా రుచిగా వుంటుంది.
గ్రీన్ టీ, బ్లాక్ టీ, మొదలైన వాటికి నిమ్మరసం కలిపి తాగవచ్చు.
నిమ్మరసం పొటాషియానికి మూలం. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఖనిజం
చక్కెర నియంత్రణ కోసం ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.