గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 19 జులై 2024 (22:50 IST)

బార్లీ నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బార్లీ నీరు మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, అధిక క్రియాటినిన్ స్థాయిలు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడానికి కిడ్నీకి సహాయపడుతుంది. వీటితో ఇంకేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము.
 
కిడ్నీలను క్లీన్ చేయడంలో బార్లీ గింజల నీరు ఎంతగానో సహాయపడుతుంది.
బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను వడకట్టి అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి.
రోజూ ఒక గ్లాస్ ఇలా తాగితే కిడ్నీలు శుభ్రంగా మారుతాయి, కిడ్నీలో స్టోన్లు కరిగిపోతాయి.
బార్లీ గింజల నీటిలో అధికమోతాదులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వున్నాయి.
బార్లీ గింజల నీళ్లు తాగితే అధిక బరువు తగ్గుతారు. షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయి.
బార్లీ గింజల నీళ్లు తాగితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది.