1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 22 మే 2019 (19:06 IST)

మధ్యాహ్నం నిద్ర గురించి తెలుసా?

సాధారణంగా మనలో చాలా మంది మధ్యాహ్నం పూట నిద్రపోతుంటాము. అనేక రకాల పని ఒత్తిడి కారణంగా, పొద్దున్నే ప్రారంభమైన మన దినచర్య సాయంత్రం వరకు బిజీగా ఉండడం, అందుకు మధ్యాహ్నం ఒక గంటపాటు నిద్రపోవడాన్ని సియస్టా అంటాం. ఇలా ఒక గంటపాటు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. అలాగే యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. 
 
సాయంత్రం, రాత్రి సమయం వరకు పని చేసే వాళ్లకు ఇది దోహదపడుతుంది. చాలా సహాయకరంగా మారుతుంది. ఎప్పుడైతే మన శరీరం అలసటకు గురవుతుందో అప్పుడు ఒక గంట నిద్రపోవడం ద్వారా, పొద్దున్నుండి మధ్యాహ్నం దాకా పని చేసి ఒక గంట నిద్రపోవడం ద్వారా మనం ఆహారం తీసుకున్న తర్వాత ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది, అదే విధంగా మనం ఎక్కువసేపు పని చేయడానికి సహాయం చేస్తుంది.