రక్తం సరఫరా సాఫీగా సాగాలంటే...
శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేర వేసేందుకు రక్తం పనికొస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూడడంలోనూ రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి రక్తం సరిగ్
శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేర వేసేందుకు రక్తం పనికొస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూడడంలోనూ రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి రక్తం సరిగ్గా సరఫరా అవకపోతే మనకు అనేక సమస్యలు వస్తాయి.
అయితే, ప్రతి వ్యక్తి శరీరంలో రక్తం తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. మొత్తం శరీర బరువులో సుమారుగా 7 నుంచి 8 శాతం మేరకు రక్తం ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తిలో దాదాపుగా 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుందన్నమాట. ఇందులో స్త్రీపురుషుల ఆరోగ్య స్థితి, ఎత్తు వంటి అనేక అంశాల వల్ల రక్తం పరిమాణం మారుతుంది.
శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోతే ఆకలి లేకపోవడం, పాదాలు, చేతులు మొద్దుబారిపోయి స్పర్శ లేనట్లు అనిపించడం, జీర్ణ సమస్యలు రావడం, త్వరగా అలసి పోవడం, చర్మం రంగు మారడం, రక్త నాళాలు ఉబ్బిపోవడం, వెంట్రుకలు, గోర్లు విరిగిపోయినట్లు అవడం తదితర సమస్యలు వస్తాయి.
ప్రతి రోజూ తగినంత నీరు తాగాలి. నీటి వల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్‌ను రోజూ తినాలి. వీట్లిలో ఉండే విటమిన్ ఎ, బి, సి, ఇ, మెగ్నిషియం, ఐరన్‌లు మన శరీరంలో రక్త సరఫరాను పెంచుతాయి.
అలాగే రోజూ గ్రీన్ టీ తాగాలి. ఇది రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది. వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగం చేసుకున్నా రక్త సరఫరాను మెరుగు పరుచుకోవచ్చు.