ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (16:23 IST)

రక్తదానం : ఒక గ్రూపువారు ఏ గ్రూపువారికి రక్తం దానం చేయొచ్చు

రక్తదానం అనేది మానవత్వానికి నిదర్శనం. ఇది సహచర మానవుల పట్ల ప్రేమను, దయను ప్రదర్శించే పవిత్రమైన కార్యక్రమం. రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానం వంటిదే. రోగ నివారణ కోసం... ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతి

రక్తదానం అనేది మానవత్వానికి నిదర్శనం. ఇది సహచర మానవుల పట్ల ప్రేమను, దయను ప్రదర్శించే పవిత్రమైన కార్యక్రమం. రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానం వంటిదే. రోగ నివారణ కోసం... ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని మరొకరి అవసరానికి వాడదలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపారదృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాలా మంది రక్తాన్ని దానం చేస్తారు. అయితే, ఒక గ్రూపు కలిగిన రక్తదాతలు ఏ గ్రూపు వారికి రక్తందానం చేయొచ్చన్న దానిపై స్పష్టత లేదు. అందుకే బ్లండ్ బ్యాంక్ నిర్వాహకులు అందరి రక్తాన్ని సేకరించి... నిల్వవుంచి అవసరమైన వారికి వినియోగిస్తుంటారు. 
 
* సాధారణంగా ఏ ప్లస్ గ్రూపు రక్తం వారు ఏ ప్లస్, బి ప్లస్ వారికి దానంగా ఇవ్వొచ్చు. 
* ఏ మైనస్ గ్రూపు రక్తం కలిగినవారు ఏ ప్లస్, ఏబీ ఏపీ మైనస్, ఏబీ ప్లస్, ఏ మైనస్ వారికి ఇవ్వొచ్చు. 
* బి ప్లస్ రక్తం కలిగిన వారు బీ ప్లస్, ఏబీ ప్లస్ వారికి ఇవ్వొచ్చు. 
* బీ మైనస్ రక్తం కలిగినవారు బీ ప్లస్, బీ మైనస్, ఏబీ ప్లస్, ఏబీ మైనస్ వారికి దానంగా ఇవ్వొచ్చు. 
* ఓ ప్లస్ రక్తం కలిగినవారు ఏ ప్లస్, బీ ప్లస్, ఏబీ ప్లస్, బి ప్లస్ వారికి దానంగా ఇవ్వొచ్చు. 
* ఓ మైనస్ రక్తం కలిగినవారు ఏ ప్లస్, ఏ మైనస్, బీ ప్లస్, బీ మైనస్, ఏబీ ప్లస్, ఏబీ మైనస్, ఓ ప్లస్, ఓ మైనస్ వారికి ఇవ్వొచ్చు. 
* ఏబీ ప్లస్ రక్తంగలవారు ఏబీ ప్లస్ వారికి దానంగా ఇవ్వొచ్చు. 
* ఏబీ మైనస్ రక్తం కలిగిన వారు ఏబీ ప్లస్, ఏబీ మైనస్ వారికి ఇవ్వొచ్చు.