శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 27 నవంబరు 2023 (17:44 IST)

బ్రెజిల్ నట్స్ ఉపయోగాలు తెలిస్తే తెచ్చుకుని తింటారు

Brazil Nuts
డ్రైఫ్రూట్స్. వీటిలో బ్రెజిల్ నట్స్ అనేవి కూడా వున్నాయి. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఈ విత్తనాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బ్రెజిల్ నట్స్ తింటుంటే ప్రాణాంతక వ్యాధి కేన్సర్ బారిన పడకుండా బయటపడవచ్చు. బ్రెజిల్ నట్స్‌లో వున్న ఐరన్ ఎముకలను దృఢంగా మార్చడంలో దోహదపడతుంది.
 
కండరాల సమస్య వున్నవారు, నొప్పులతో బాధపడేవారు బ్రెజిల్ గింజల్ని తింటే చాలు. జీర్ణ సంబంధ సమస్యలను లేకుండా చేయడంలో బ్రెజిల్ నట్స్ మేలు చేస్తాయి. కేశాలు ఊడిపోతున్నాయని బాధపడేవారు బ్రెజిల్ గింజలు తింటే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
అధిక బరువు తగ్గించుకోవాలనుకునేవారు బ్రెజిల్ గింజలు తింటుంటే ఫలితం వుంటుంది. బ్రెజిల్ గింజలను పురుషులు తింటుంటే వారికి అవసరమైన శక్తిని కలుగజేస్తుంది. ఈ విత్తనాలు తింటే థైరాయిడ్ సమస్యలు కూడా రావని నిపుణులు చెపుతున్నారు.