శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (17:48 IST)

అల్పాహారంలో ఇడ్లీ.. కోడిగుడ్డు వుంటే మేలేంటో తెలుసా? (video)

అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, ఫైబర్ కూడిన పదార్థాలు వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కోడిగుడ్డు, గోధుమలతో చేసిన వంటకాలు, ఇడ్లీలు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. పాఠశ

అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, ఫైబర్ కూడిన పదార్థాలు వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కోడిగుడ్డు, గోధుమలతో చేసిన వంటకాలు, ఇడ్లీలు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, యువత, మహిళలు, పొద్దున్నే అల్పాహారం తీసుకోవడంపై శ్రద్ధపెట్టరు. అయితే అల్పాహారం విషయంలో నిర్లక్ష్యంగా వుంటే అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని.. అందుకే పోషకాలున్న ఆహార పదార్థాలను అల్పాహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా రోజూ అల్పాహారంలో కోడిగుడ్డు వుండేలా చూసుకోవాలని వారు చెప్తున్నారు. మాంసకృత్తులూ, యాంటీఆక్సిడెంట్లు ఉండే గుడ్డును ఉడికించి తింటే, మెదడూ, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి. పైగా దానివల్ల కంటి సంబంధ సమస్యలు కూడా రావు. పొట్ట నిండినట్టు ఉంటుంది. ఎక్కవసేపు ఆకలి కూడా వేయదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.
 
అలాగే ఇడ్లీలను అల్పాహారంగా తీసుకుంటే.. బలవర్థకమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మాంసకృత్తులూ, అమినోయాసిడ్లూ, పిండిపదార్థాలు పుష్కలంగా వుంటాయి. పైగా కొలెస్ట్రాల్ సమస్య వుండదు. అయితే సాంబారు కాకుండా.. చట్నీతో తింటే మంచిది. గోధుమల్లో పీచు ఎక్కువగా వుంటుంది.

గోధుమ ఉప్మా లేకుంటే కూరగాయలతో కలిసి కిచిడీలా చేసుకుని తింటే జీర్ణాశయంలో అనవసరమైన వ్యర్థాలు తొలగిపోతాయి. ఇంకా అల్పాహారంలో బాదం పప్పులు, వాల్‌నట్స్ తీసుకుంటే శరీరానికి పీచు అందుతుంది. తద్వారా బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.