శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (18:43 IST)

గుత్తివంకాయ కూర తింటే.. కొలెస్ట్రాల్ పరార్..

వంకాయలు అంటేనే గుత్తివంకాయ కూర గుర్తుకు వచ్చేస్తుంది... కదూ.. అయితే వంకాయలను తరచూ తీసుకోవడం ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.. వంకాయలను వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకోవడం ద్వారా శ

వంకాయలు అంటేనే గుత్తివంకాయ కూర గుర్తుకు వచ్చేస్తుంది... కదూ.. అయితే వంకాయలను తరచూ తీసుకోవడం ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.. వంకాయలను వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకోవడం ద్వారా శరీర కొలెస్ట్రాల్ శాతం తగ్గుముఖం పట్టడమే కాకుండా మధుమేహం అదుపులోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
అదేవిధంగా శరీర అధిక బరువును తగ్గించేందుకు కూడా వంకాయలు మేలు చేస్తాయి. క్యాన్సర్ వంటి ప్రమాకరమైన వ్యాధుల బారి నుంచి రక్షించే గుణాలు వంకాయల్లో పుష్కలంగా వున్నాయి. వంకాయల్లో పాస్ఫరస్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6, ప్రోటీన్లు, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, ఫోలేట్, విటమిన్ కె తదితర అనేక పోషకాలు ఉన్నాయి. 
 
ఇవి ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తాయి. వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. దీనితో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. తద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.