శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:24 IST)

బరువు తగ్గాలంటే ఆ సమయంలో మాత్రమే తినాలి...

ఉదయం 10 గంటల నుండి ఆరు గంటల మధ్యలో మాత్రమే ఆహరం తీసుకుని మిగిలిన 16 గంటలు ద్రవ పదార్థాలు తీసుకుంటే బరువు తగ్గవచ్చని అంటున్నారు. ఈ సమయంలో నచ్చిన ఆహారాన్ని కావలసినంత తీసుకోవచ్చును. అయితే ఆరు దాటిన తరువాత 16 గంటల పాటు మాత్రం కేవలం నీళ్లు, క్యాలరీలు లేని

ఉదయం 10 గంటల నుండి ఆరు గంటల మధ్యలో మాత్రమే ఆహరం తీసుకుని మిగిలిన 16 గంటలు ద్రవ పదార్థాలు తీసుకుంటే బరువు తగ్గవచ్చని అంటున్నారు. ఈ సమయంలో నచ్చిన ఆహారాన్ని కావలసినంత తీసుకోవచ్చును. అయితే ఆరు దాటిన తరువాత 16 గంటల పాటు మాత్రం కేవలం నీళ్లు, క్యాలరీలు లేని పానీయాలు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది.
 
బరువు తగ్గించుకోవడంపై జరిగిన కొన్ని ఇతర పరిశోధనల వివరాలతో పోల్చి చూసినప్పుడు 16 గంటలు నిరాహారంగా ఉన్నవారు బరువు వేగంగా తగ్గడంతో పాటు రక్తపోటు కూడా 7 మిల్లీమీటర్ల మేరకు తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైంది.

కొన్ని రకాల ఆహార పదార్థాలను త్యజించడం, క్యాలరీలు లెక్కపెట్టకుండా తినడం వంటివే కాకుండా బరువు తగ్గించుకునేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయనేందుకు పరిశోధన ఒక నిదర్శనమని క్రిస్టా వరాడే అనే శాస్త్రవేత్త చెప్పారు.
 
16-8 ఆహార పద్ధతిపై శాస్త్రీయంగా జరిగిన తొలి పరిశోధన ఇదేనని చెపుతున్నారు. అయితే ఈ అంశంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంటుందని చెప్పారు. ఊబకాయంతో మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నది తెలిసిన విషయమే.