గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (15:43 IST)

రోజూ ఉడికించిన బ్రొకోలి అరకప్పు తీసుకుంటే బరువు తగ్గుతారట..!

ఎల్లప్పుడు ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే ఏం తినాలో తెలీక చాలామంది నానా హైరానా పడుతుంటారు. అయితే దీనికి సమాధానమేంటో తెలుసా బ్రొకోలి. దీన్నితినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతుంది. విటమిన్లు, మినరల్స్‌, ఎక

ఎల్లప్పుడు ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే ఏం తినాలో తెలీక చాలామంది నానా హైరానా పడుతుంటారు. అయితే దీనికి సమాధానమేంటో తెలుసా బ్రొకోలి. దీన్నితినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతుంది. విటమిన్లు, మినరల్స్‌, ఎక్కువ శాతం వీటిలో దొరుకుతుంది.
 
పచ్చి బ్రొకోలిని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల పోషకాలు నశించకుండా అలాగే శరీరానికి చేరుతుంది. విటమిన్‌ ఎ, సి, కె లు, కాల్షియం దీనిలో పుష్కలంగా లభిస్తాయి. ఇది కోలన్‌ క్యాన్సర్‌ రాకుండా రక్షిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులను దరి చేరనివ్వదు. 
 
బ్రొకోలిలో ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటే తక్కువగా తినడమే కాకుండా ఫ్యాట్‌‌ని నిర్మూలిస్తుంది. ప్రతిరోజు ఉడికించిన బ్రొకోలిని తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్‌ సి, విటమిన్‌ కె లభిస్తుంది. రోజూ అరకప్పు మోతాదులో బ్రొకోలిని తీసుకోవడం ద్వారా ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.