సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (16:29 IST)

డయాబెటిస్‌కు దివ్యౌషధం బ్రౌన్ రైస్.. ఒబిసిటీ కూడా పరార్ (Video)

బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎంత మేలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఎర్రబియ్యం డయాబెటిస్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి అయితే షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎర్ర బియ్యం తీసుకోవాల్సిందే. 
 
ఎర్రబియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో అధిక బరువును కూడా నియంత్రించుకోవచ్చు. ఎర్రబియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే.. బొజ్జ తగ్గిపోతుంది. ఈ రైస్ కొంచెం తీసుకుంటేనే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. తద్వారా బరువు తగ్గడం సులభం అవుతుంది.
 
ఇకపోతే.. మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. అలాంటి వారు ఎర్రబియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచి ఉపశమనం పొందుతారు.

శ్వాస సమస్యలను ఎర్రబియ్యం దూరం చేస్తుంది. బ్రౌన్‌రైస్‌లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. ఎముకలకు సంబంధించి వ్యాధులను బ్రౌన్ రైస్ నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.