శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By JSK
Last Modified: బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:00 IST)

గుప్పెడంత గుండె... ల‌బ్ డ‌బ్... హార్ట్ బీట్ ఎప్ప‌టిక‌పుడు గ‌మ‌నించండి...

గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడు, ఆ జేబులు వెనక ఓ గుండె ఉంటుందనీ దానినీ జాగ్రత్తగా చూసుకోవాలన్నది మర్చిపోతున్నారు. ఒక‌ప్పుడు కే

గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడు, ఆ జేబులు వెనక ఓ గుండె ఉంటుందనీ దానినీ జాగ్రత్తగా చూసుకోవాలన్నది మర్చిపోతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్దవారిలో మాత్ర‌మే క‌నిపించిన గుండె జ‌బ్బులు ఇప్పుడు యుక్తవ‌య‌స్సు వారిలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి.
 
కొంతమందికి హార్ట్ ఎటాక్ గురించిన పూర్తి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల అది మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడు జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోతోంది. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ ఉంది. దీనిపై అవగాహన కలిగి ఉండటం వ‌ల్ల ఎంతో విలువైన ప్రాణాల‌ను కాపాడుకునేందుకు వీలుంటుంది.
 
1. జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి. దీంతోపాటు ద‌గ్గు కూడా ఎక్కువ‌గా వ‌స్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
2. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.
3. ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు. వైద్యుడిని సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి.
4. మ‌త్తుమ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.
5. విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులుగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా ప‌నిచేస్తాయి.
6. ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా, క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి. చాలామంది గుండె నొప్పి ప్రారంభ లక్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతీ నొప్పిగా పొరపడుతుంటారు.
7. కంటి చివ‌ర్ల‌లో కురుపుల వంటివి వ‌స్తే వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు.
8. కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు అన్నీ ఉబ్బిపోయి క‌నిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచ‌న‌లుగా భావించాలి.
9. శ‌రీరం పై భాగం నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పి వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. అంతేకాదు ఒక్కోసారి ద‌వ‌డ‌ల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించ‌వ‌చ్చు.
10. గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే గుండె కొట్టుకోవ‌డం కూడా ఎప్పటిలాగా ఉండదు. కాబ‌ట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్‌ను కూడా గ‌మ‌నిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధార‌ణ బీట్ క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి. నిర్లక్ష్యం చేసిన ప్రతీసారి మరణానికి ఒక్కో అడుగు దగ్గర అవుతున్నట్టే…