ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 7 డిశెంబరు 2023 (22:32 IST)

నల్ల వెల్లుల్లి ఔషధ గుణాలు తెలుసా?

Diabetes
తెల్ల వెల్లుల్లి గురించి అందరికీ తెలుసు. ఐతే నల్ల వెల్లుల్లిని తిని చూసారా. ఈ నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నల్ల వెల్లుల్లి మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి.
 
నల్ల వెల్లుల్లి తీసుకుంటే రక్తంలో చక్కెర, డయాబెటిస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. నల్ల వెల్లుల్లి జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. నల్ల వెల్లుల్లి తీసుకుంటే రక్తం పలుచబడి గుండె సమస్యలు రాకుండా మేలు చేస్తుంది.
 
అల్జీమర్స్ వంటి సమస్యల నుండి బైటపడేయడంలో నల్ల వెల్లుల్లి సహాయపడుతుంది. నల్ల వెల్లుల్లి రక్త ప్రసరణను పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.