గుండె ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల రసాలు, ఏంటవి?
ఇటీవలికాలంలో గుండె సమస్యలతో ఇబ్బందిపడేవారి సంఖ్య పెరుగుతోంది. గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సమస్యలు దరిచేరవు. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగుతుంటే గుండెకి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. బీట్‌రూట్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ రక్తపోటును తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను పెంచుతుంది.
క్రాన్‌బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్‌లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇ పుష్కలం. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం గుండె ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం, నరాల ప్రేరణలకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.
ఫైబర్ అధికంగా ఉండే నారింజ మీ జీర్ణవ్యవస్థను కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టొమాటో రసం రోజువారీ వినియోగం హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.