శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (14:07 IST)

రోజుకు ఒక గ్లాసుడు బత్తాయి రసం చాలు..

Mosambi Juice
Mosambi Juice
రోజుకు ఒక గ్లాసుడు బత్తాయి రసం తీసుకుంటే చాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. బత్తాయిని కొనడం తక్కువ ఖర్చుతో కూడిన పని. ఈ పండులో చాలా పోషకాలున్నాయి. ఈ సిట్రస్ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. 
 
ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ సిట్రస్ పండులో 90 శాతం నీరు ఉంటుంది. అయినప్పటికీ, ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు, పొటాషియం, కాల్షియం, విటమిన్-సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఈ పండు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. రోజూ గ్లాసుడు బత్తాయి రసాన్ని క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. బత్తాయిరసం తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
 
అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్సర్లు, డీహైడ్రేషన్, జీర్ణక్రియ సమస్యలను నయం చేసే శక్తి బత్తాయి రసానికి వుంది. ఇది కళ్లను రక్షించడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.