శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (09:07 IST)

అల్పాహారాన్ని ఉదయం కాకుండా మధ్యాహ్నం తీసుకుంటున్నారా.. గుండెకు పోటే మరి..

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాల్సిన దోశ, ఇడ్లీ, పూరీ ఇలాంటి ఐటమ్స్ ను లంచ్, డిన్నర్‌లలోనూ తీసుకుంటారు కొందరు. కానీ, ఆరోగ్యరీత్యా ఇది మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ అసలు మిస్‌ కావద్దు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారికి గుండెప

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాల్సిన దోశ, ఇడ్లీ, పూరీ ఇలాంటి ఐటమ్స్ ను లంచ్, డిన్నర్‌లలోనూ తీసుకుంటారు కొందరు.  కానీ, ఆరోగ్యరీత్యా ఇది మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ అసలు మిస్‌ కావద్దు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారికి గుండెపోటు లేదా ప్రాణాపాయ ముప్పు 27 శాతం ఎక్కువగా ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 
 
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ఆకలి బాగా పెరిగిపోతుంది. దీంతో మధ్యాహ్నం లంచ్ పరిమాణం పెరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్ పెరగడానికి దారితీస్తుంది. దీనివల్ల డయాబెటిస్, బ్లడ్ ప్రజర్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తీసుకునే ఆహారం శరీరంలో బ్లడ్ షుగర్ పరిమాణాలు మిగిలిన రోజంతా ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తాయి. 
 
అధిక తీపి, నూనె పదార్థాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయి, ఆ తర్వాత మరింత తక్కువ స్థాయికి తగ్గిపోతాయి. దాంతో మళ్లీ ఎక్కువ ఆకలి వేస్తుంది. ఫలితంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటుకు దారితీస్తుంది. అందుకే శరీరంలో బ్లడ్ షుగర్ ఒకే రీతిలో ఉండేందుకు వీలుగా ఉదయం ఆహారం తీసుకోవడం మంచిది. 
 
సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్, లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రుళ్లు విశ్రాంతి సమయమే కనుక డిన్నర్ స్వల్పంగా ఉండాలి. 
 
ఒకవేళ లంచ్ తక్కువగా, డిన్నర్ ఎక్కువగా తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్నవారు కనీసం డిన్నర్ లో తీసుకునే ఆహారం చాలా తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరు తమ ఆహారంలో కూరగాయలు, సలాడ్ ఎక్కువ తీసుకోవాలి.