శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (13:12 IST)

నిమ్మరసం తాగిన తర్వాత అరగంట సేపు ఎలాంటి ఆహారం తీసుకోకూడదా?

లెమన్ వాటర్ త్రాగిన తర్వాత అరగంట సేపు ఎటువంటి ఆహారం లేదా పానీయాలు కానీ తీసుకోకూడదు. ఇలా క్రమంగా చేస్తే... బెల్లీ ఫ్యాట్‌ను కాకుండా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద

లెమన్ వాటర్ త్రాగిన తర్వాత అరగంట సేపు ఎటువంటి ఆహారం లేదా పానీయాలు కానీ తీసుకోకూడదు. ఇలా క్రమంగా చేస్తే... బెల్లీ ఫ్యాట్‌ను కాకుండా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి, అవసరం అయితే కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. గోరువెచ్చని గ్లాసుడు నీటిలో ఒక నిమ్మకాయను పిండి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కాలేయంలో ఎంజైములను పెంచి శరీరంలో టాక్సిన్స్ తొలగిపోయేలా చేస్తుంది.
 
కాలేయం సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. ఇంకా బెల్లీఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ లెమన్ వాటర్ భేష్‌గా పనిచేస్తుంది. ఒత్తిడితో కూడిన కాలేయం శరీరంలో జీవక్రియలను సక్రమంగా జరగనివ్వదు. తద్వారా నడుము చుట్టూ, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ కొవ్వంతా కరిగిపోవాలంటే చేయాల్సిందల్లా నిమ్మరసం తాగాల్సిందే. అదీ పరగడుపున. బెల్లీని ఫ్యాట్‌ను కరిగించాలంటే లెమన్ వాటరే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
నిమ్మరసాన్ని ఆహారం తీసుకున్నాక తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే ఆహారం తీసుకున్నాక గంట తర్వాతే నిమ్మరసం తీసుకోవాలి. లేకుంటే పరగడుపున తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.