మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 జులై 2023 (22:23 IST)

ఎండు ఖర్జూరాలు తినేవారు తెలుసుకోవలసిన విషయాలు

ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు.
 
ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది. దంతాలు, ఎముకలను పటిష్టపరిచే శక్తి ఎండు ఖర్జూరాలకు వుంది. కంటిచూపును మెరుగుపరచడంలో ఎండు ఖర్జూరాలు సహాయపడుతాయి.