మాంసాహారం అధికంగా తీసుకుంటే.. మధుమేహం తప్పదా?
మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారంలో అధికంగా వుండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు చెప్తున్నారు. మాంసాహారంలోని ఆర్
మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారంలో అధికంగా వుండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు చెప్తున్నారు.
మాంసాహారంలోని ఆర్చిడోనిక్ అనే యాసిడ్ మానవ మెదడుపై ప్రభావం చూపుతుందని.. తద్వారా మనిషి మూడ్‌ను మార్చే గుణం మాంసాహారంలో వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అందుకే మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలని.. అధికంగా తీసుకుంటే.. మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. కానీ శాకాహారం విషయంలో అలా జరగదని.. శాకాహారంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా శాకాహారం తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50శాతం తగ్గిపోతాయని అధ్యయనం తేల్చింది.
శరీర పుష్టికి మాంసాహారం అవసరమే. కానీ, అవసరానికి మించి మాంసాహారం తీసుకోవడం అనేది శరీరానికి హానికరం. మాంసాహారం వలన శరీరంలో అదనపు కొవ్వు పెరుకుపోతుంది. అయితే, శాకాహారంలో అలాంటి ఇబ్బందులుండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శాకాహారంతో ఒత్తిడి మాయమవుతుంది. ఒబిసిటి దూరమవుతుందని వైద్యులు చెప్తున్నారు.